Site icon HashtagU Telugu

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?

SBI Aims 1 Lakh Crore Profit

SBI Aims 1 Lakh Crore Profit

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతా ఉందా? అందులో నుంచి ఇటీవల రూ. 206.50 కట్ అయ్యాయా ..? అలా ఎందుకు కట్ అయ్యాయి.. అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అమౌంట్ మీ ఒక్కరికే కట్ కాలేదని గుర్తుంచుకోండి..ఇలా చాలా మంది కస్టమర్లకు జరిగింది. చాలా మంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ల నుండి డబ్బు కట్ అయ్యిందని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. అయితే మీ అకౌంట్ నుంచి డబ్బు కట్ కావడానికి ఒక కారణం ఉంది. అది ఏమిటో తెలుసుకుంటే.. మీ సమస్యకు పరిష్కారం లభించినట్లే!!

వాస్తవానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ డెబిట్ / ATM కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగ దారుల పొదుపు ఖాతాల నుంచి రూ. 147, రూ.206.5 లేదా రూ. 295 కట్ చేసింది.

మీరు కూడా SBI కస్టమర్ అయితే.. దాని బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా ఉపయోగిస్తుంటే.. సంవత్సరానికి ఒకసారి మీ సేవింగ్స్ ఖాతా నుంచి కొంత మొత్తం ఇలా కట్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువ, గోల్డ్, కాంబో లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ఎటిఎమ్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌ల నుంచి వేర్వేరు ఛార్జీలను విధించడం వల్ల ఈ అమౌంట్ కట్ అయింది.

రూ.147.50 లెక్క ఇదీ..

ఎస్‌బీఐ నుంచి క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ పేర్లతో పలు డెబిట్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రతీ ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సిందే. వాస్తవానికి యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీ రూ.125. అదనంగా 18 శాతం జీఎస్‌టీ రూ.22.50 కలిపి మొత్తం రూ.147.50 వసూలు చేస్తుంది బ్యాంకు.

రూ.206.5 లెక్క ఇదీ..

యువ డెబిట్ కార్డ్, గోల్డ్ డెబిట్ కార్డ్, కాంబో డెబిట్ కార్డ్ లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ATM కార్డ్‌తో సహా ఈ డెబిట్/ATM కార్డ్‌లలో దేనినైనా ఉపయోగించే వ్యక్తుల నుంచి SBI వార్షిక నిర్వహణ రుసుముగా రూ. 175 వసూలు చేస్తుంది.అదే సమయంలో ఈ అమౌంట్ కటింగ్ పై 18% GST కూడా వర్తిస్తుంది. దీంతో ఈ మొత్తానికి రూ.31.5 (రూ.175లో 18%) GST జోడించబడింది. ఇవన్నీ కలుపుకొని రూ.175 + రూ.31.5తో.. మొత్తం రూ.206.5 అవుతుంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ పొదుపు ఖాతా నుంచి కట్ చేసిన రూ. 206.5 ఇవే..

Also Read:  India vs Australia ODI: చెపాక్ లో చెక్ ఎవరికో? సిరీస్ డిసైడర్ కు భారత్, ఆసీస్ రెడీ