Site icon HashtagU Telugu

Cash Seized : బంజారాహిల్స్‌లో భారీగా ప‌ట్టుబ‌డ్డ హ‌వాలా డ‌బ్బు

Fact Check

Money

హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీగా హ‌వాలా డ‌బ్బు ప‌ట్టుబ‌డింది. పోలీసులు మంగళవారం రాత్రి రూ.2 కోట్ల లెక్కల్లో చూపని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిర్దిష్ట సమాచారంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ (పశ్చిమ) బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి రోడ్ నంబర్ 12 వద్ద కారును ఆపి వాహనంలో నగదును కనుగొన్నారు. కారులో ఉన్నవారు నగదు మూలానికి మద్దతుగా పత్రాలను చూపించలేకపోయారు. అందువల్ల న‌గ‌దు మొత్తం స్వాధీనం చేసుకున్నారు.దీనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే రోజున గాంధీనగర్ పోలీసులు కారులో తరలిస్తున్న ఆరుగురి నుంచి రూ.3.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గాంధీనగర్‌లో కారును ఆపి తనిఖీ చేయగా ఆరుగురి వ్యక్తులు నగదును తీసుకెళ్తున్నారు. మొత్తం వివిధ డినామినేషన్లలో ఉంది. వ్యక్తులు నగదు మూలానికి మద్దతుగా ఎలాంటి పత్రాలను సమర్పించలేకపోయారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.