Site icon HashtagU Telugu

Rs 1cr bounty: నుపుర్ శర్మపై విమర్శల వెల్లువ!

nupur sharma

nupur sharma

మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల పోలీసు స్టేషన్ల లో ఆమెపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. ముస్లిం సంఘాలు నుపుర్ పై ఆగ్రహంతో ఉన్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఏఐఎంఐఎం(ఇంఖిలాబ్) పార్టీ అధ్యక్షుడు ఖావీ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వాళ్ళ తలకు కోటి రూపాయల రివార్డును ఇస్తానని గతంలో నేను ప్రకటించాను. ప్రత్యేకించి వసీం రిజివి విషయంలో అలా అప్పట్లో కామెంట్స్ చేశాను.

దాన్నే ఇప్పుడు నేను నుపుర్ శర్మ విషయంలోనూ పునరావృతం చేస్తున్నాను” అని ఖావీ అబ్బాసీ వెల్లడించారు. నుపుర్ శర్మ తలకు కోటి రూపాయల రివార్డు ఉంటుందని పునరుద్ఘాటించారు. మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యల ద్వారా ముస్లింల మనోభావాలను నుపుర్ శర్మ కించపరిచారంటూ ఓ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై ముంబై లో కేసు నమోదైంది.