Site icon HashtagU Telugu

Rs 10 Frooti Vs 8 Crores Robbery : రూ.10 ఫ్రూటీతో ఎర.. 8 కోట్లు దొంగిలించిన కపుల్ అరెస్ట్

Rs 10 Frooti Vs 8 Crores Robbery

Rs 10 Frooti Vs 8 Crores Robbery

Rs 10 Frooti Vs 8 Crores Robbery : చిన్న ఎరతో .. పెద్ద చేప దొరికింది. 

బ్యాంకు క్యాష్ వ్యాన్ ను ఎత్తుకెళ్ళి.. అందులోని రూ.8.5 కోట్లను కాజేసిన దొంగ కపుల్స్ 100 గంటల్లోనే పట్టుబడ్డారు.  

10 రూపాయల ఫ్రూటీని ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్టుగా పోలీసులు వేసిన ట్రాప్ లో వాళ్ళు పడిపోయారు. 

మన్‌దీప్ కౌర్ అలియాస్ మోనా, ఆమె భర్త జస్విందర్‌ సింగ్‌.. రాత్రికి రాత్రి రిచ్ అయిపోయేందుకు పెద్ద స్కెచ్ వేశారు. పంజాబ్ లోని లూథియానాలో ఉన్న న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలో జూన్ 10న అర్ధరాత్రి 1.30 గంటలకు ఒక బ్యాంక్ సెక్యూరిటీ క్యాష్ వ్యాన్‌ను వారు ఎత్తుకెళ్లారు. ఆ టైంలో వ్యాన్‌లో రూ.8 కోట్ల 49 లక్షలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లూథియానా పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకొని.. GPS ద్వారా వ్యాన్‌ను ట్రాక్ చేశారు. దీంతో అది లూథియానాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్లన్‌పూర్ గ్రామంలో ఉందని తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా.. దుండగులు డబ్బులు తీసుకొని వ్యాన్ ను వదిలేసి పారిపోయారని తేలింది. వ్యాన్ లో పోలీసులకు పదునైన ఆయుధాలు, రెండు పిస్టల్స్‌ లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా,  బ్యాంక్ సెక్యూరిటీ క్యాష్ వ్యాన్‌ సిబ్బంది బ్యాక్ గ్రౌండ్ పై దర్యాప్తు చేయడంతో పోలీసులకు మరింత సమాచారం లభించింది. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకొని.. వారి నుంచి రూ.5 కోట్ల 96 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నోట్ల కట్టలతో సోషల్ మీడియాలో మోనా వీడియో..

ఆ ఐదుగురి వెనుక సూత్రధారులుగా ఉండి నడిపించిన మన్‌దీప్ కౌర్ అలియాస్ మోనా, ఆమె భర్త జస్విందర్‌ సింగ్‌ మాత్రం దొరకలేదు. అయితే ఆ తర్వాత  రూ.500 నోట్ల కట్టలతో మోనా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దాని ఆధారంగా పోలీసులు వారి లొకేషన్ ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. బ్యాంక్ సెక్యూరిటీ క్యాష్ వ్యాన్‌ను ఎత్తుకెళ్లిన వ్యవహారంలో ఆ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రమేయం కూడా ఉందని గుర్తించారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి.. బ్యాంక్ భవనం వెనుక తలుపుల నుంచి దొంగలు రావడానికి అతడే హెల్ప్ చేశాడని దర్యాప్తులో వెల్లడైంది.

Also read : Body Parts Sale : బాడీ పార్ట్స్ దొంగిలించి అమ్మేశాడు..మార్చురీ మేనేజర్ నిర్వాకం

దొంగతనం సక్సెస్.. మొక్కు చెల్లించుకునేందుకు..  

దొంగతనం సక్సెస్ ఫుల్ గా జరిగిందని ఉత్తరాఖండ్ లోని చమోలిలో ఉన్న హేమకుండ్ సాహిబ్‌కు మొక్కు చెల్లించుకునేందుకు మన్‌దీప్ కౌర్ దంపతులు వెళ్లారు. హేమకుండ్ సాహిబ్‌ నుంచి కేదార్‌నాథ్, హరిద్వార్ లకు,, అక్కడి నుంచి  రోడ్డు మార్గంలో నేపాల్ కు పారిపోవాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు. వారిని ట్రాక్ చేస్తున్న లూథియానా పోలీసులు అంతకంటే పెద్ద స్కెచ్ వేశారు. హేమకుండ్ సాహిబ్‌కు మన్‌దీప్ కౌర్ దంపతులు చేరుకున్నారు.. అక్కడ అప్పటికే పంజాబ్ పోలీసుల టీమ్ మఫ్టీలో నిలబడి 10 రూపాయల ఫ్రూటీలు ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. మన్‌దీప్ కౌర్ దంపతులు కూడా క్యూ లైన్ లో వచ్చి పోలీసుల నుంచి ఫ్రూటీ(Rs 10 Frooti Vs 8 Crores Robbery) తీసుకున్నారు. వాళ్ళు  మన్‌దీప్ కౌర్  దంపతులే అని గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఈ కేసును 100 గంటల్లోనే  ఛేదించి, నిందితులను పట్టుకున్న పోలీసుల టీమ్ కు రూ.10 లక్షల రివార్డు అందించారు.