RRR Star: అమర జవాన్లకు రామ్ చరణ్ ‘సెల్యూట్’

ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతరామరాజు గా మెగాహీరో రామ్ చరణ్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Ram Charan

ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతరామరాజు గా మెగాహీరో రామ్ చరణ్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ కూడా నటించిన ఈ చిత్రం ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ సినిమా విడుదలైనప్పటికీ ఆయన నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. అయ్యప్ప మాల ధరిండం, అభిమానులను కలుసుకోవడం, ఆచార్య ప్రమోషన్ల బిజీబిజీగా ఉంటూ చర్చనీయాంశమవుతున్నారు.  తాజాగా రామ్ చరణ్ ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లోని  అమరవీరులకు నివాళులు అర్పించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ.. దేశభద్రతను కాపాడుతోన్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ఈ  కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు.

 

 

  Last Updated: 23 Apr 2022, 05:05 PM IST