Site icon HashtagU Telugu

RRR: మార్చ్ 18న త్రిబుల్ ఆర్ విడుదల

RRR

RRR

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. మార్చి 18 న విడుదల కానుంది. ఆ రోజున ఒక వేళ విడుదల చేయలేకపోతే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం అయింది. ఆ మేరకు శుక్రవారం ప్రకటించారు .
(రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా..

కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఇటు కరోనా కేసులు తగ్గడంతో పాటు అటు ఏపీలో కూడా టికెట్ రేట్ల విషయంలో త్వరలో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.పలు భాషల్లో అదే రోజు విడుదల చేయడానికి రెడీ అయ్యారు.