Rajamouli New Car: ఎపిక్ డైరెక్టర్ కోసం..ఎపిక్ కారు..దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తాజాగా స్వీడర్ కార్ బ్రాండ్ అందిస్తున్న వోల్వో XC40 కారును కొనుగోలు చేశారు.

  • Written By:
  • Publish Date - April 23, 2022 / 12:20 PM IST

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తాజాగా స్వీడర్ కార్ బ్రాండ్ అందిస్తున్న వోల్వో XC40 కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఓల్వో ఇండియా తమ అధికారిక ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసింది. రెడ్ కలర్ వోల్వో కారును రాజమౌళి డెలివరీ తీసుకుంటున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను రాజమౌళి ఇలా సెలబ్రెట్ చేసుకున్నారని..ఎపిక్ డైరెక్టర్ కోసం ఎపిక్ కారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. డైరెక్టర్ రాజమౌళి కొనుగోలు చేసిన రెడ్ కలర్ వోల్వ్ XC40SUV. స్వీడన్ లగ్జీర కారుబ్రాండ్ వోల్వో 2018లో తొలిసారిగా దీనిని భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇది వోల్వో ఇండియా ప్రొడక్ట్ లైనప్ లో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవన్ SUV. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ 40లక్షలు ఉంటుంది.

గతేడాది ఇదే సమయంలో వోల్వో కారు ఇండియా తమ BS-6 XC-40SUV ధరను భారీగా తగ్గించింది. వోల్వో XC40 ఎస్ యూవీపై కంపెనీ ఏకంగా 3.26లక్షల వరకు తగ్గించింది. ఈ డిస్కౌంట్ తర్వాత దీని ధర ఎక్స్ షోరూమ్ ధర రూ. 37. 99లక్షలకు చేరుకుంది. అయితే ఇప్పుడు వోల్వో తమ అన్ని కార్ల ధరలను దాదాపు 3శాతం వరకు పెంచింది. ఈ ధరల పెంపు పరిగణలోని తీసుకుంటే వోల్వో ఆర్ రోడ్ కు చేరుకునే సరికి దాని ధర దాదాపు 45 నుంచి 48లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

వోల్వో XC40 డిజైన్…
ఇందులో వోల్వో సిగ్నేచర్ T-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో కూడాని ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ గ్లోస్ బ్లాక్ లో ఉండే సింగిల్ ప్రేమ్ ఫ్రంట్ గ్రిల్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బాడీ చుట్టూ మందపాటి ప్లాస్టిక్ క్లాడింగ్ తో XC40 మంచి రగ్గడ్ లుక్ ను కలిగి ఉంటుంది. ఇందులో నిలువుగా ఉండే టెయిల్ ల్యాంప్స్ , డ్యూయెల్ టోక్ ఎక్ట్సీరియర్ కలర్స్ తో మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. ఇక లోపలి భాగంలో పియానో బ్లాక్, అల్యూమినియం పెయింట్ స్కీమ్ లో ఫినిషింగ్ చేయబడి ఉంటుంది. దీని టచ్ స్క్రీన్ చుట్టూ అల్యూమినియం యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఈ కారులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్, డాష్ మౌంటెడ్ వూఫర్, పానోరమిక్ సన్ రూఫ్, స్మార్ట్ ఫోన్లల కోసం వైర్ లెస్ ఛార్జింగ్ కలిగిన 12.3 అంగుళాల వర్టికల్ టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. వీటితోపాటు ఇందులో ఎమ్ ఐడి టచ్ స్క్రీన్, డిస్టెన్స్ అలెర్ట్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ అసిస్ట్ హ్యాండ్స్ ఫ్రీ ఆపరేటింగ్ టైల్ గేట్స్ వంటివి ఉన్నాయి.

ఇక వోల్వో XC40కారు 2019లో ప్రీమియం కారు అవార్డును కూడా పొందింది. ఈ అవార్డును అందుకున్న తొలి లగ్జరీ కారుగా ఈ ఎక్స్‌సి40 నిలిచింది. ఇండియా మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 , ఆడి క్యూ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఈ కారు ఉంటుంది. వోల్వో XC40 మోడల్‌ లో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ కారును కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు “వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్” ను ఆవిష్కరించనుంది. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అనేది స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ వోల్వో XC40 ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ వాహనం. వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా రూట్ లో భారత్ కు దిగుమతి చేసుకోనున్నారు.