ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడు, మన తెలుగువాడు అయినటువంటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరల్డ్ వైడ్ గా శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రిలీజ్ కు ముందే కలెక్షన్ల పరంగా పలు రికార్డులు నమోదు చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఆల్‌టైం రికార్డ్ లను సెట్ చేస్తోంది. అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు 5 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. దీంతో 4.59 మిలియన్ డాలర్ల ‘బాహుబలి 2’ రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ చేసింది. ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకు ఇదే ఆల్‌టైం రికార్డు. నైజాంలోనూ ‘ఆర్ఆర్ఆర్’ జోరు చూపిస్తోంది. తొలిరోజే రూ. 23.35 కోట్లు వసూలు చేసి ఏ సినిమాకూ అందనంత ఎత్తులో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. ఇక ఓవర్సీస్ లో అయితే హాలీవుడ్ సినిమాలను వెనక్కినెట్టి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజే ఓవరాల్ గా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా.
ఫస్ట్ డే నైజాం ఏరియా లెక్కలు:
‘ఆర్ఆర్ఆర్’- రూ. 23.35 కోట్లు
‘భీమ్లానాయక్’- రూ.11.85 కోట్లు
‘పుష్ప’- రూ. 11.44 కోట్లు
‘రాధేశ్యామ్’- రూ. 10.80 కోట్లు
‘సాహో’- రూ. 9.41 కోట్లు
‘బాహుబలి 2’- రూ. 8.9 కోట్లు
‘వకీల్‌సాబ్’- రూ. 8.75 కోట్లు