Site icon HashtagU Telugu

MM Keeravani: నాటు నాటు విజయకేతనం.. కీరవాణి ఎమోషనల్

Keeravani

Keeravani

95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు అవార్డ్‌ వరించింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది.

ఆస్కార్‌ అవార్డును నాటునాటు పాట సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి, పాట రచయిత చంద్రబోస అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి వేదికపై మాట్లాడాడరు. ‘ధన్యవాదాలు, అకాడమీ! నేను వడ్రంగుల మాటలు వింటూ పెరిగాను మరియు ఇప్పుడు, ఇక్కడ నేను ఆస్కార్‌తో ఉన్నాను. కీరవాణి తన మనసులోని మాటను సింపుల్‌గా పాడారు, ’నా మనసులో ఒకే ఒక కోరిక ఉంది, రాజమౌళి మరియు నా కుటుంబం కూడా! ట్రిపుల్‌ఆర్‌ గెలవాలి, ప్రతి భారతీయుడి గర్వం! నన్ను ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలి!

దీన్ని సాధ్యం చేసినందుకు కార్తికేయ, వేరియెన్స్‌ చిత్రాలకు ధన్యవాదాలు. మీ అందరిపై అభిమానంతో! ధన్యవాదాలు!’ అని కీరవాణి అన్నారు. ‘ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లలతో ఈ ఆనందం పంచుకోవాలని ఉంది’ అని పేర్కొన్నారు. ఇక గీత రచయిత చంద్రబోస్‌ ‘నమస్తే’తో ప్రసంగాన్ని ముగించారు.