RRB: ఆ ఎగ్జామ్ రాసిన వాళ్లకు రూ.400.. రీఫండ్ ప్రకటించిన ఆర్ఆర్బీ..

2019లో దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి పోస్టులకు అప్లై చేసుకున్న జనరల్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు శుభవార్త.

RRB Refunding for this Exam : 2019లో దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి పోస్టులకు అప్లై చేసుకున్న జనరల్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు శుభవార్త. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా 2022 ఆగస్టు 17 నుంచి 2022 అక్టోబర్ 11 వరకు జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT)కు హాజరైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. దరఖాస్తుల స్వీకరణ టైంలో జనరల్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థుల నుంచి తీసుకున్న రూ.500 పరీక్ష ఫీజులో రూ.100 తీసుకొని.. మిగిలిన రూ.400 అభ్యర్థుల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థుల నుంచి దరఖాస్తు టైంలో తీసుకున్న రూ.250 ఫుల్ అమౌంట్ రిఫండ్‌ చేయనున్నారు.

ఈమేరకు RRB ఒక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు రుసుమును అభ్యర్థుల  బ్యాంకు ఖాతాల్లోకి రీఫండ్‌ చేయనున్నట్టు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT)కు హాజరైన అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరీక్ష రాయని అభ్యర్థులకుఈ అమౌంట్ రిఫండ్ రాదని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 14న ఉదయం 10గంటల నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతా నంబర్‌, IFSC కోడ్‌ తదితర వివరాలను మరోసారి అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

దీనిలో ఏ బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు రీఫండ్ కావాలో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గత నాలుగేళ్ల వ్యవధిలో పలు బ్యాంకులు విలీనం కావడంతో IFSC కోడ్‌లు మారాయని.. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరోసారి అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. అభ్యర్థులు తప్పుడు వివరాలు సమర్పించడం వల్ల రిఫండ్‌ చేసిన మొత్తం వారి ఖాతాల్లో జమకాకపోతే అందుకు RRB ఎలాంటి బాధ్యత వహించవని స్పష్టంచేసింది.

RRB గ్రూప్ డీ రీఫండ్ లింక్

https://recruitapp.in/123gpd_cen01ref_int_patund2019456Intent/login.php

Also Read:  IGNOU Recruitment: 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్స్.. రూ.63,200 వరకూ జీతం