Site icon HashtagU Telugu

Hyderabad: నగరంలో పట్టుబడ్డ గంజాయి బ్యాచ్

Hyderabad

New Web Story Copy 2023 07 05t140127.429

Hyderabad: తెలంగాణాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా ఇప్పటికే చాలా వరకు తగ్గింది. అయితే కొందరు కేటుగాళ్లు అతితెలివి ప్రదర్శించి గంజాయి రవాణాను యధేచ్చగా సాగిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పోలీసులు గంజాయి సప్లయ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా.. సికింద్రాబాద్ ఇన్‌స్పెక్టర్, సికింద్రాబాద్ ఆర్‌పిఎఫ్ క్రైమ్ ప్రివెన్షన్ టీమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు నెం.11020లో తనిఖీలు నిర్వహించగా ఎస్1 కోచ్‌లో ఒక ట్రాలీ సూట్‌కేస్‌తో అనుమానాస్పద వ్యక్తిని గుర్తించారు. వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో అనుమానించిన అధికారులు విచారించారు. దీంతో నిందితుల బండారం బయటపడింది. ట్రాలీ సూట్‌కేస్‌లో బ్రౌన్ కలర్ ప్లాస్టర్‌తో ప్యాక్ చేసిన 5 పొడి గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ దాదాపు రెండు కిలోల బరువు, 10 కిలోల మొత్తం విలువ రూ. 10,00,000 ఉంటుంది అని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి గంజాయి సామాగ్రితో పాటు వ్యక్తిని రైల్వే పోలీసులకు అప్పగించారు.

ఇదేకాకుండా నగరంలో మరో వ్యక్తి గంజాయి రవాణాలో పట్టుబడ్డాడు. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో డ్రైవ్‌లు నిర్వహించారు. రైలు నెం-12794 రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి వద్ద ఒక్కో బ్యాగ్‌లో రెండు తెల్లటి పాలిథిన్ బ్యాగులు, 10 ప్యాకెట్లు మొత్తం 20 ప్యాకెట్లు కలిగి ఉన్న ఒక మగ, ఒక మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన సామాగ్రి సుమారు 39.5 కిలోల బరువు రూ. 39,50,000 ఉంటుందని అంచనా.

Read More: Pawars Game : మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంటే.. మీటింగ్ కు హాజరైన 32 మంది

Exit mobile version