Site icon HashtagU Telugu

Royal Dishes: రాజుల కాలంలోని ఈ వంటకాల గురించి తెలుసా? ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిందే..!

భారతదేశంలో విభిన్న సంస్కృతులు కనిపించినట్లే.. ప్రతి ప్రాంతంలో విభిన్నమైన వంటకాలు నోరూరిస్తుంటాయి. భారతదేశపు వంటలలో.. సుగంధ ద్రవ్యాల వాడకం ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. వీటితో వంటకాలకు గొప్ప రుచి వస్తుంది. అయితే భారతదేశంలో పూర్వపు రాజుల వంశాలు కూడా వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అద్భుతమైన రుచితో కూడిన వంటకాలు సిద్దం చేసేందకు ప్రత్యేకమైన పాక శాస్త్ర నిపుణులు ఉండేవారు. అలాంటి కొన్ని రుచికరమైన వంటకాలను ఇప్పుడు చూద్దాం..

Indrahar Recipe

రేవా రాజవంశం పాలనలో ఇంద్రహర్ అనేది వారి ప్రముఖ వంటకం. రేవా రాజ్యంలో ఆహారం ఎక్కువగా కాయధాన్యాలు, బచ్చలికూర, తక్కువ నీరు అవసరమయ్యే ఇతర ఉత్పత్తులతో చేసేవారు. ఈ వంటకం విషయానికి వస్తే.. 5 కాయధాన్యాలు రాత్రిపూట నానబెట్టి, పులియబెట్టి, ఆవిరితో తయారు చేయబడింది. ఈ వంటకాన్ని వేయించిన లేదా ఆవిరిలో ఉడికించిన తర్వాత రుచి చూడవచ్చు. ఈ రుచికరమైన వంటకం.. సుగంధ ద్రవ్యాలు, పప్పులు, కొన్ని సాంప్రదాయ పాక రహస్యాల మిశ్రమం.

Gosht Khada Masala

నిజాం రాజుల కాలంలో గోష్ట్ ఖడా మసాలా అనేది చాలా ఫేమస్ అనే చెప్పాలి. మాంసాహారం, సుగంధ ద్రవ్యాల సమ్మేళనంతో కూడిన అద్భుతమైన వంటకం ఇది. సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన ఒక అద్భుతమైన వంటకంగా చెబుతారు. రాజ వంశానికి చెందిన స్త్రీలు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆహారం యొక్క రుచిపై దృష్టి పెడతారు. అందుకే వారి వంటకాలు చాలావరకు హకీమ్‌ల మార్గదర్శకత్వంతో తయారు చేసేవారు.

Tahri Recipe

పూర్వపు రాజ్యమైన ప్రతాప్‌గఢ్, కలకంకర్‌ ప్రాంతాల్లో ప్రత్యేక వంటకాల్లో ఒకటి తహ్రీ. ఇది సుగంధ ద్రవ్యాలు, పప్పులు, కూరగాయతో వండి అన్నం మిశ్రమంతో కూడిన రుచికరమైన వంటకం.

kangra food treat

కటోచ్ రాజవంశంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ రాజ భోజనం కాంగ్ర. ఇది సుగంధ ద్రవ్యాల సువాసనను, మంచి రుచులను ఇష్టపడే వ్యక్తులకు ఒక ట్రీట్ మాదిరిగా ఉంటుంది.

Hara Maas

అఖేరాజ్ రాజవంశంకు చెందిన క్లాసిక్ వంటకాలు చాలానే ఉన్నాయి. అందులో హర మాస్, రాబోరి, మత్కీ మాస్ ప్రముఖమైనవి. మార్వార్, మేవార్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ రాజవంశంకు చెందిన రుచికరమైన వంటకాలు అక్కడి స్థానికతతో ప్రభావితమయ్యాయి.