Site icon HashtagU Telugu

AP : పవన్ గుండె పగిలి ఎక్కడ చచ్చిపోతాడేమో అనే భయం వేస్తోందంటూ మంత్రి రోజా ఎద్దేవా

roja fires on pawan kalyan over his comments on cm jagan

roja fires on pawan kalyan over his comments on cm jagan

వైసీపీ మంత్రి రోజా (Minister Roja) మరోసారి తన నోటికి పనిచెప్పింది. ప్రతిపక్ష నేతలపై విరుచుకపడాలంటే మంత్రి రోజా తర్వాతే ఎవరైనా..అందుకే ఆమెను ఫైరింగ్ రోజా అంటారు. ఈ ఫైరింగ్ చూసే సీఎం జగన్..ఆమెకు మంత్రి పదవి ఇచ్చినట్లుందని అంత అనుకుంటారు. ప్రత్యర్ధులు ఏ స్థాయి వ్యక్తులైన..గతంలో వారితో పనిచేసి ఉన్న..వారు దగ్గరి వారైనా సరే..రోజా లెక్క చేయదు..తాను ఏ పార్టీ లో ఉంటె..ఆ పార్టీ అధినేత ను ఆకాశానికి ఎత్తేస్తూ, అవతలి పార్టీ వ్యక్తులను కిందకు దించుతుంటుంది.

ప్రస్తుతం ఏపీలో జనసేన vs వైసీపీ వారు నడుస్తుంది. జనసేన తరుపున ఒక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉంటె..వైసీపీ నుండి సీఎం జగన్ నుండి కిందిస్థాయి నేతల వరకు దాపు అరడజను మంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంటారు. తమ ప్రభుత్వం ఫై ఏమన్నాసరే ఈ అరడజను నేతలు మాత్రం అస్సలు ఊరుకోరు. మా జగన్ ను అంటావా..మా తప్పులు బయటపెడతావా..మా ఆస్తుల ఫై ఆరోపణలా..అంటూ రెచ్చిపోతారు. తాజాగా మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్ ఫై అలాగే రెచ్చిపోయింది.

గత నాల్గు రోజులుగా పవన్ మూడో విడత వారాహి యాత్ర (Varahi Yatra 3rd Schedule)చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ ఫై పవన్ నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. దీంతో మంత్రి రోజా పవన్ ఫై కాస్త ఘాటైన కామెంట్లే చేసింది. తన కన్నా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుందని, అందుకే “భూమి పేలి పోవాలి ఋషికొండ దాంట్లోకి వెళ్లిపోవాలి అందులో జగన్ సమాధి కావాలని” పవన్ కళ్యాణ్ అంటున్నాడని ..పవన్ మాటల్లో కడుపు మంట కనపడుతుందని ..పవన్ కళ్యాణ్ ఇలా కడుపు మంటతో అరిచి అరిచి గుండె పగిలి ఎక్కడ చచ్చిపోతాడేమో అనే భయం వేస్తోందంటూ రోజా ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ ను రిక్వెస్ట్ చేసి ఆరోగ్యశ్రీ కింద కడుపు మంటల కళ్యాణ్ ను ఆసుపత్రుల్లో చేర్పించి ఆయన కడుపు మంటను తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. అప్పటికి పవన్ కళ్యాణ్ కు కడుపు మంట చల్లారకపోతే హైదరాబాదులోని ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఆమె ఎద్దేవా చేశారు. రిషికొండ పైన ఏమున్నా కనిపించని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు టూరిజం శాఖకు సంబంధించిన హరిత రిసార్ట్స్ ను తిరిగి నిర్మిస్తుంటే, ఎందుకు కడుపుమంటతో విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. విశాఖ బ్రాండ్ ను చెడిపేందుకే చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కు వారం రోజులపాటు షెడ్యూల్ ఇచ్చి విశాఖ నుంచి విమర్శలు చేయిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

Read Also : Good News To Farmers : రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్