Site icon HashtagU Telugu

Rohit Sharma Fought: విరాట్ కోహ్లీ కోసం సెలక్టర్లతో గొడవపడ్డ రోహిత్ శర్మ..?

Team India

Team India

Rohit Sharma Fought: 2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వెల్లడైంది. దీంతో భారత జట్టులో ప్రతి స్థానానికి టగ్ ఆఫ్ వార్ (Rohit Sharma Fought) మొదలైంది. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. సెలెక్టర్లు రాబోయే టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో ఎవరినైనా ఒకరినే జట్టులోకి తీసుకోనున్నట్లు ఆ వార్త సారాంశం. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆశలకు ఎదురుదెబ్బ తగలనుంది. ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ గేమ్‌ను దృష్టిలో ఉంచుకుని వారి పేర్లను బోర్డు చర్చిస్తోంది. అయితే ఐపీఎల్‌లో దూకుడు ప్రదర్శించడంలో కోహ్లీ సఫలమైతే అతను టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ హంగామా నడుమ ఇప్పుడు ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. రాబోయే T20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ కోసం రోహిత్ శర్మను సెలక్టర్లు సంప్రదించినట్లు 𝐇𝐲𝐝𝐫𝐨𝐠✅𝐧 𝕏 అనే సోషల్ మీడియా ఖాతా నుండి భాగస్వామ్యం చేయబడింది. టీ20 ప్రపంచకప్ జట్టులో విరాట్ కోహ్లీ పేరు ఉండాలని ‘హిట్‌మ్యాన్’ కోరినట్లు సమాచారం. అయితే సెలెక్టర్లకు, రోహిత్ కి మధ్య కాస్త హాట్ డిబేట్ నడిచినట్లు కూడా తెలుస్తోంది.అయితే కోహ్లి నెమ్మదిగా ఆడటంపై సెలక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. T20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 1న టోర్నీ ప్రారంభం కానుంది. 29 రోజుల ఉత్కంఠ అనంతరం జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read: Message To India : ఇండియాకు బంగ్లాదేశ్ ప్రధాని థ్యాంక్స్.. ఏమన్నారంటే..

భారత్, పాకిస్థాన్‌లు ఎప్పుడు తలపడనున్నాయి..?

టీ20 ప్రపంచకప్ 2024లో జూన్ 9న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై వోల్టేజీ పోటీకి న్యూయార్క్ నగరం వేదికగా నిలవనుంది. టీ20 ఫార్మాట్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ సమయంలో భారత జట్టు పైచేయి సాధించింది.

We’re now on WhatsApp. Click to Join.