Site icon HashtagU Telugu

Rohit Sharma: పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ పుజారా, రహానేలపై వేటు

T20 World Cup 2024

Rohit Sharma

భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికయ్యాడు. దీంతో అన్ని ఫార్మేట్లలోనూ హిట్‌ మ్యాన్ సారథిగా కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా టూర్‌ తర్వాత టెస్ట్ ఫార్మేట్ కెప్టెన్సీ నుండి కోహ్లీ
తప్పుకున్నాడు. కోహ్లీ స్థానంలో ఇప్పటికే వన్డే , టీ ట్వంటీల్లో జట్టు సారథిగా ఎంపికైన రోహిత్‌కే పగ్గాలు అప్పగించడం ఖాయమని తేలిపోయింది. ఫార్మేట్‌కో కెప్టెన్ ఐడియా భారత క్రికెట్‌కు
సరికాదని పలువురు అభిప్రాయపడడంతో రోహిత్‌శర్మకే సెలక్టర్లు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌తో రోహిత్ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు
చేపట్టనున్నాడు.

మరోవైపు శ్రీలంకతో టీ ట్వంటీ , టెస్ట్ సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించారు. ఊహించిట్టుగానే ఫామ్‌లో లేని పుజారా, రహానేలపై వేటు పడింది. చాలా కాలంగా వీరిద్దరూ స్థాయికి తగినట్టు
రాణించలేకపోతున్నారు. సఫారీ టూర్ తర్వాత సెలక్టర్లు రంజీ ట్రోఫీ ఆడి ఫామ్ నిరూపించుకోవాలని వీరికి సూచించారు. సెలక్టర్ల సూచనతో పుజారా, రహానే ప్రస్తుతం రంజీ మ్యాచ్‌లు
ఆడుతున్నారు. ఒకవేళ రంజీల్లో నిలకడగా రాణించకుంటే మాత్రం వీరిద్దరి కెరీర్ ముగిసినట్టేనని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే లంకతో సిరీస్‌కు జడేజా, బుమ్రా తిరిగి వచ్చారు. రోహిత్‌కు
డిప్యూటీగా బుమ్రాను ఎంపిక చేసిన సెలక్టర్లు జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్ళకు అవకాశమిచ్చారు. ప్రియాంక్ పంచల్‌తో పాటు నెట్‌ బౌలర్‌గా సౌరభ్ కుమార్‌ను ఎంపిక చేశారు.

కాగా లంకతో టీ ట్వంటీ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చారు. ఇప్పటికే బబూల్ నుండి ఇంటికి వెళ్ళిపోయిన వీరిద్దరూ లంకతో టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో
ఉండనున్నారు. కాగా టీ ట్వంటీ సిరీస్‌కు పంత్‌ రెస్ట్ తీసుకోవడంతో బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. దాదాపు విండీస్‌తో ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు.
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ ఫిబ్రవరి 24న మొదలుకానుంది. తొలి మ్యాచ్ లక్నోలో జరగనుండగా.. తర్వాతి రెండు మ్యాచ్‌లకూ ధర్మశాల ఆతిథ్యమిస్తోంది. ఇక మార్చి 4
నుండి తొలి టెస్టు మొహాలీలో జరగనుండగా.. బెంగళూరు వేదికగా డే నైట్ టెస్ట్ మార్చి 12 నుండి మొదలవుతుంది.

Exit mobile version