Site icon HashtagU Telugu

Robotic Surgery: 70 ఏళ్ల వృద్ధురాలికి రోబోటిక్ సర్జరీ.. వీడియో వైరల్

Robotic

Robotic

హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా వైద్య, విద్య రంగాల్లోనూ పోటీ పడుతోంది. వైద్యంలో నూతన టెక్నాలజీ వాడుతూ ఎన్నో రోగాలను నయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ యశోద డాక్టర్స్ 70 ఏళ్ల పెద్దావిడకు రోబోటిక్ సర్జరీ చేసి సక్సెస్ అయ్యారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ముసలావిడ చికిత్స నిమిత్తం యశోద డాక్టర్స్ ను సంప్రతించింది. ఆ వయసులో సాధారణ చికిత్స ఆమెకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు రోబోటిక్ సర్జరీ చేశారు. అర్థోపెడిక్ స్పెసలిస్ట్ దశరథరామారెడ్డి డైరెక్షన్ లో ఈ ట్రీట్ మెంట్ కొనసాగింది. ముసలావిడకు ఏమాత్రం నొప్పిరాకుండా ట్రీట్ మెంట్ చేసి సక్సెస్ అయ్యారు.