Site icon HashtagU Telugu

CCTV Video: పట్టపగలు నడీ రోడ్డుపై తుపాకీ గురిపెట్టి చోరీ: వైరల్ వీడియో

CCTV Video

26 06 2023 Pragati Maidan Loot Cctv Video 23452552

CCTV Video: దేశ రాజధానీ ఢిల్లీలో నడీ రోడ్డుపై దుండగులు చోరీకి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరిస్తూ కారులోని బ్యాగును పట్టుకెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన ఢిల్లీలో పట్టపగలే చోటుచేసుకోవడం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.

గుజరాత్‌లోని మెహసానాకు చెందిన సజన్ కుమార్ అనే వ్యక్తికి చాందినీ చౌక్‌లో బంగారు, వెండి ఆభరణాల వ్యాపారం ఉంది. గురుగ్రామ్‌లోని ఓ సంస్థకు రూ.2 లక్షలు ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం క్యాబ్‌లో వెళ్తున్నాడు. ఆయనతోపాటు సహచరుడు జితేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఎర్రకోట నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రింగ్ రోడ్డు నుంచి బయలుదేరాడు. ప్రగతి మైదాన్ నుండి సొరంగంలోకి ప్రవేశించిన వారు ఇండియా గేట్ వైపు బయలుదేరాలి. ఆ సమయంలో రెండు బైక్‌లపై నలుగురు దుండగులు క్యాబ్‌ను అడ్డుకున్నారు. అనంతరం పిస్టల్‌ చూపిస్తూ కారు అద్దాలు తెరిచి బ్యాగ్ లాక్కెళ్లారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన సిసి ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: Russia New President : పుతిన్ టైం క్లోజ్.. రష్యాకు కొత్త ప్రెసిడెంట్ ?