Liquor Truck: బోల్తా కొట్టిన బీర్ల లోడు లారీ…ఎగబడ్డ స్థానికులు..!!

ప్రకాశం జిల్లాలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

Published By: HashtagU Telugu Desk
Truck

Truck

ప్రకాశం జిల్లాలో బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. బీర్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న జనం గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. అసలే ఆదివారం రోడ్డుపై బీర్ బాటిళ్లు…మందు బాబులు పండగ చేసుకున్నారు. దీంతో ఫుల్లుగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ ఘటన సింగరాయ కొండ మండలంలో జరిగింది. లారీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయలేక తలపట్టుకున్నారు. రోడ్డుపై పడిపోయిన బీర్ బాటిల్స్ ను జేసీబీ సాయంతో పక్కన ఉన్న కాలువలోకి నెట్టేశారు. అయినా కొందరు మందుబాబులు కాలువలోకి దిగి మరి బీర్ బాటిల్స్ ను సేకరించారు. ఎంతైనా ఫ్రీగా వస్తున్నాయ్ కదా అస్సలు వదిలిపెట్టరు.

  Last Updated: 22 May 2022, 04:15 PM IST