విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం ఉదయం రైల్వేస్టేషన్ నుంచి సిరిపురం వైపు ఆటోను వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొన్న లారీ దాదాపు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో మధురవాడ నగరంలోని పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
Road Accident విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ

Road Accident