MLA Vamsi Mohan : ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కాన్వాయ్‌కి ప్ర‌మాదం.. తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే

Published By: HashtagU Telugu Desk
MLA Vamsi

MLA Vamsi

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాసింపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. తాను సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నాన‌ని… గ‌న్న‌వ‌రం నియోజకవర్గ ప్రజలు మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని వంశీ తెలిపారు.

 

  Last Updated: 19 Aug 2023, 03:11 PM IST