తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాతకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. జస్టిస్ వి సుజాత హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఈ ఘటన జరిగింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి కారు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనని అటుగా వెళ్తున్న కొంతమంది బాటసారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయమూర్తిని సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించారు. న్యాయమూర్తికి స్వల్ప గాయాలు కాగా ఆమె తలపై రెండు కుట్లు పడ్డాయి. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Accident : సూర్యాపేట వద్ద ఏపీ హైకోర్టు జడ్డి కారుకు ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ జడ్జి

Road accident