సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70మంది ఉన్నారు. ఇందులో 25 మందికి తీవ్రగాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ మహేశ్, సీఐ జగదీశ్, పోలీసు సిబ్బంది పరిశీలించారు. క్షతగాత్రులను సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Road Accident: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 25 మందికి తీవ్ర గాయాలు, 4 పరిస్థితి విషమం

Accident