Site icon HashtagU Telugu

road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

Mexico Bus Crash

Road accident

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదం (road accident)లో ముగ్గురు మృతి చెందారు. ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టి ముగ్గురు యువకుల దుర్మరణం చెందారు. మృతులను నందిపేట మండలం సుభాష్ నగర్ కు చెందిన, ఉమ్మేడ అశోక్, మంద మోహన్, రమేష్ లుగా గుర్తించారు. వీరు కొండగట్టు అంజన్న దర్శనానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: India- Pakistan Soldiers: భారత్, పాక్ బలగాల మధ్య కాల్పులు