Site icon HashtagU Telugu

Road Accident : నంద్యాలలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప‌ల్టీ కొట్టిన స్కూల్ ఆటో

Mexico Bus Crash

Road accident

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్లలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను పదో తరగతి చదువుతున్న రజిని, ఎనిమిదో తరగతి చదువుతున్న షాహిదాబీగా పోలీసులు గుర్తించారు. గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో డోర్ వెనుక కూర్చున్న ఇద్దరు బాలికలకు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆటోలో ఉన్న ఇతర విద్యార్థులు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.