మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని షాహాపూర్‌లో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు భక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వారు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం అర్థరాత్రి కలాంబే గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన భక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారని..వారి పరిస్థితి మెరుగుపడుతుందని పోలీసులు తెలిపారు.
Road Accident : థానేలో ఘోర ప్రమాదం.. షిర్డీకి నడిచి వెళ్తున్న భక్తులను ఢీకొట్టిన వాహనం

Road accident