Site icon HashtagU Telugu

Road Accident : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 11 మంది మృతి

Mexico Bus Crash

Road accident

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బేతుల్‌లో కారుని బస్సు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గుడ్‌గావ్, భైస్దేహి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు, జిల్లా కలెక్టర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదంలో మృతి చెందిన వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది.