Road Accident In Kavali : కావలిలో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది....

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కావ‌లి స‌మీపంలోని అలిగుంటపాలెం క్రాస్‌రోడ్‌ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం కారు నెల్లూరు నుంచి ఒంగోలుకు వస్తుండగా డివైడర్‌ను ఢీకొని పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

  Last Updated: 18 Sep 2022, 10:48 PM IST