కర్ణాటకలోని కొప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కల్కేరి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులందరూ విజయపురకు చెందిన వారని, కారు విజయపుర నుండి బెంగళూరుకు వెళ్తుంది. లారీ తమిళనాడు నుండి గుజరాత్‌కు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారు లారీ ముందు భాగంలోని కిందికి వెళ్లిపోయిందని. తెలిపారు. క్రేన్‌తో కారును తొలగించి, మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని..ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Road Accident : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారుల సహా ఆరుగురు మృతి
కర్ణాటకలోని కొప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి

Road accident
Last Updated: 29 May 2023, 05:58 AM IST