హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అతివేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ మీద ఉన్న ఇద్దరు యువకుల్లో గచ్చిబౌలికి చెందిన మధు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన చందర్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
1 Killed : హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

Road accident