Site icon HashtagU Telugu

4 Killed : ఢిల్లీలో రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

Mexico Bus Crash

Road accident

ఢిల్లీలోని ద్వారకలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జిల్లా పరిధిలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందగా, గాయపడిన మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
స్థానిక పోలీసులు విషయం తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయినప్పటికీ పోలీసులకు చిక్కాడు.ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.