బాపట్ల జిల్లాలో గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మహిళలు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అద్దంకి ఎస్సై సమందర్ బంధువులుగా తెలుస్తుండగా.. ఒంగోలు నుంచి అద్దంకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్న కారు టైరు కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ సమీపంలో పంక్చరైంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి పడింది.
Also Read: Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు
అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎస్ఐ సమందర్ వలి భార్య, కూతురు, మరదలు, మరో మహిళ, కారు డ్రైవర్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.