Site icon HashtagU Telugu

Road Accident: జాతీయ రహదారిపై ప్రమాదం.. బస్సు బోల్తా, 30 మంది ప్రయాణికులకు గాయాలు

Road Accident

Resizeimagesize (1280 X 720) 11zon

Road Accident: బీహార్ లోని మధుబని జిల్లాలోని ఫుల్‌పరస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. కిస్నిపట్టి కెనాల్ సమీపంలో జాతీయ రహదారి 57పై ఆదివారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. అదే సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులంతా సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమని సమాచారం. సిలిగురి నుంచి గయా వెళ్తున్న బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. మృతురాలు గుజరాత్‌లోని వడోదర నివాసి తనూభాయ్ పటేల్ భార్య హంసా దేవి (65)గా గుర్తించారు. ప్రమాదం అనంతరం ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికుల రోదనలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Sex With Dead body : డెడ్ బాడీపై లైంగిక వేధింపులకు.. శిక్ష వేసే చట్టాల్లేవ్!

ప్రమాదం అనంతరం ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన మహిళను గుజరాత్‌లోని వడోదరకు చెందిన తనూభాయ్ పటేల్ భార్య 65 ఏళ్ల హంసా దేవిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ముందు నుంచి సరైన వేగంతో వస్తోందని ప్రమాద స్థలం సమీపంలో ఉన్న వ్యక్తి తెలిపారు. ఒక్కసారిగా బోల్తాపడింది. మాకు ఏమీ అర్థం కాకముందే పెద్ద శబ్ధం, ఏడుపు వినిపించింది. శబ్దం విని ఇతర వ్యక్తులు కూడా ఇటువైపు పరుగులు తీశారు. దీని తరువాత, మేము బస్సు అద్దాలను పగలగొట్టి ప్రజలను బయటకు తీయడం ప్రారంభించామని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతుడి కుటుంబీకులను సంప్రదించి ఘటనపై సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.