Site icon HashtagU Telugu

AP: ఆరోగ్య సురక్షతో అందరికీ ఆరోగ్యం: మంత్రి రోజా

Minister Roja

Minister Roja

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం తీసుకువచ్చారని రాష్ట్ర పర్యాటక, సాంసృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె .రోజా పేర్కొన్నారు. పుత్తూరు మండలం కృష్ణసముద్రం నందు శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని చిత్తశుద్ధితో, సీఎంగా సంతకం పెట్టిన మొదటి రోజు నుంచి ఈనాటికి వరకు 99% అభివృద్ధి పనులను, సంక్షేమాలను పూర్తిచేసారని, నాలుగేళ్లలో ని దాదాపుగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు మీ అందరి అకౌంట్లో వేశారని తెలిపారు. ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండాలని, తమ పిల్లలు చక్కగా చదివి తమ కుటుంబ ఆరోగ్యం గా ఉంచాలనే ఒకే ముఖ్యమంత్రి అంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అని, ఎందుకంటే ఈ రోజు దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించారని తెలిపారు.

పిల్లలు బడికి వెళ్లడానికి ఆ తల్లిదండ్రులకు ఆర్థిక సపోర్టు ఇచ్చి, ఈ పోటీ ప్రపంచంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫుడ్ ని అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించడమే కాకుండా, అలాగే పాఠశాల నుంచి బయటకు వచ్చిన తరువాత ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్యలతో పేదవాడు కూడా గొప్ప చదువులు చదువుకొని సమాజంలో గౌరవంగా ఆర్థికంగా ఎదగడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా వుండాలని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అని గొప్ప కార్యక్రమం అమలుచేయడం జరిగిందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శ్రీరామరక్ష అని ఈరోజు దేవుడు మనకిచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యాన్ని అందించాలని నిర్ణయించి దాని ప్రకారం ప్రతి మనిషికి టెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు.

ఒక మనిషికి ఈరోజు చేసిన టెస్ట్ చేయాలి అంటే దాదాపు 2500 రూపాయలు అవుతుందని, ఆరోగ్యశ్రీ కింది 3300 జబ్బులకి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు ఊరికి వచ్చిన తర్వాత జీవనోపాధిని కోల్పోయి పనిచేయలేక రెస్ట్ లో ఉన్న వాళ్ళకి రోజుకు 250 రూపాయల చొప్పున ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. పుత్తూరు రూరల్ మండలం కృష్ణ సముద్రం సచివాలయంలో 816 మందిని ఎంపిక చేయగా వారిలో దాదాపుగా 450 మందికి గాను వైద్య పరీక్షలు నిర్వహించారు వీటితోపాటు కంటి వెలుగు పథకం కింద పరీక్షల నిర్వహించడంతో దాదాపుగా 56 మందికి గాను కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని మంత్రి రోజా తెలిపారు.