Site icon HashtagU Telugu

Controversy in RR vs RCB: రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ ఢీ అంటే ఢీ

26harshal1 Imresizer

26harshal1 Imresizer

రసవత్తరంగా సాగిన బెంగళూరు , రాజస్థాన్ మ్యాచ్‌లో వివాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించిన రియాన్ పరాగ్ , బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ మధ్య వాగ్వాదం జరిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్
చివరి ఓవర్‌ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో స్ట్రెయిక్ ఎండ్‌లో ఉన్న పరాగ్ ఒక ఫోర్, రెండు సిక్సర్లతో ఏకంగా 18 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 144 పరుగులు చేశాడు. అదే ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్.. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి బంతిని స్టాండింగ్ పొజిషన్‌లో సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత డగౌట్‌కు వెళ్తున్న సమయంలో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నడిచింది. ఆ సమయంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ సభ్యుడు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియోని కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.. వీడియో హర్షల్ పటేల్ పరాగ్ పైపైకి వస్తుండటంతో మరో వ్యక్తి ఆపినట్లు కనిపించింది.

అయితే అక్కడ ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ.. సిక్సర్ కొట్టాడనే అసహనంతోనే హర్షల్ పటేల్‌ అతనితో వాగ్వాదానికి దిగాడని కొదరంటుంటే.. రియాన్ పరాగ్ నోరు జారడంతోనే హర్షల్ రియాక్ట్ అయ్యాడని మరికొందరూ అంటున్నారు. మొత్తానికి ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే
కెప్టెన్ సంజూ శాంసన్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రియాన్ పరాగ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి మంచి స్కోర్ అందించాడు. ఒకానొక దశలో రాజస్థాన్ 120 పరుగులకే పరిమితమవుతుందని అనుకున్న సమయంలో 31 బంతులు ఆడిన పరాగ్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.