Tomato Price: కొండెక్కుతున్న టమాటా ధరలు… కిలో రూ.160

టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. ఎవరు టమాటాలు కొని తినే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా కిలో రూ.100 పలికిన టమాటా (Tomato), దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు రూ.150 దాటిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Tomato New Price

Tomato New Price

Tomato Prices in India : టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. ఎవరు టమాటాలు కొని తినే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా కిలో రూ.100 పలికిన టమాటా, దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు రూ.150 దాటిపోయింది. మధ్యప్రదేశ్ లో కిలో టమాటా (Tomato) కొనాలంటే రూ.160 చెల్లించాల్సిందే. దేశంలోని మరి కొన్ని ప్రాంతాల్లో టమాటాలు కిలో ఒక్కింటికి రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయి. టమాటాల వినియోగం పెరగడం, వేసవి కారణంగా కొరత ఏర్పడడం వంటి కారణాలతో ధరలు మండిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అనేక రాష్ట్రాల్లో టమాటాలు (Tomato) తగ్గింపు ధరలతో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలోని రైతు బజార్లలో కిలో రూ.50కే అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Also Read:  Twitter-3 Hour Videos : యూట్యూబ్ తో ట్విట్టర్ ఢీ.. త్వరలో 3 గంటల వీడియోలూ అప్ లోడ్ చేయొచ్చు

  Last Updated: 03 Jul 2023, 05:39 PM IST