Site icon HashtagU Telugu

Pant: పంత్ ను వెంటాడుతున్న 90 ఫోబియా

Rishab Panth

Rishab Panth

మొహాలీ టెస్టు తొలి రోజు భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీకి తృటిలో చేజార్చుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత దూకుడైన బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్ శతకంతో గర్జించేలా కనిపించదు.. కానీ అనుకోకుండా ఇన్నింగ్స్ 90వ ఓవర్‌ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్‌లో లెంగ్త్ బాల్‌ను డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడైన బ్యాటింగ్ తో అదరగొట్టిన రిషబ్ పంత్‌ శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడాడు.. ఈ క్రమంలోనే 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులతో పంత్ చెలరేగాడు.

తొలుత హాఫ్‌ సెంచరీకి 75 బంతులు తీసుకున్న రిషబ్ పంత్ ఆ తరువాత 22 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు.. కెరీర్ లో 29వ టెస్టు ఆడుతున్న రిషబ్ పంత్.. సొంత గడ్డపై ఇలా 90లో ఔటవడం ఇది నాలుగోసారి. మొత్తంగా ఐదు సార్లు సెంచరీ అవకాశాన్ని పంత్ మిస్ చేసుకున్నాడు.అయితే రిషబ్ పంత్ విధ్వంసాన్ని అప్పటివరకు ఎంతో ఆసక్తిగా చూసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అతను ఔటవ్వడంత షాక్‌కు గురయ్యారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Exit mobile version