Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యూపీలో ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి.

Published By: HashtagU Telugu Desk
pant

Resizeimagesize (1280 X 720) (3)

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యూపీలో ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి. ఉత్తర ప్రదేశ్ లోని రూర్కీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రిషబ్ పంత్ కు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కి చాలా గాయాలయ్యాయి. రూర్కీకి తిరిగి వస్తుండగా రూర్కీలోని గురుకుల్ నర్సన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పంత్ కారు పూర్తిగా దెబ్బతింది. రిషబ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి. అందులో తీవ్రమైన గాయాలు కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ కారు డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత ఆయన కారులో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత పంత్‌ను ఆసుపత్రిలో చేర్చారు. రిషబ్ పంత్ కాలికి బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

PHOTOS FROM SPOT: 

  Last Updated: 30 Dec 2022, 10:12 AM IST