Site icon HashtagU Telugu

Weight Loss: అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Weight Loss

Weight Loss

ప్రస్తుతం రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి రకరకాల వ్యాయామాలు కఠినమైన డైట్లు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు అయితే బరువు తగ్గడం కోసం ఆహారం తినడం కూడా మానేస్తూ ఉంటారు. అయితే చాలామంది అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతారని చెబుతూ ఉంటారు. ఇందుకోసం చాలామంది అన్నం తినడం మానేసి చపాతీ పుల్కా లాంటివి తీసుకుంటూ ఉంటారు.

మరి నిజంగానే అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతారా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతారు అన్నది ఏమాత్రం నిజం కాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. బరువు తగ్గాలి అనుకున్న వారు అన్నం తినడం మంచిదే కానీ అలా అని అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అన్నం ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కొంతమంది మూడు పూటలా అన్నమే తింటూ ఉంటారు. ఇలా మూడు పూటలా రైస్ తినడం వల్ల బరువు పెరగడంతో పాటు డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకున్న వారు ఒక పూట అన్నం తింటే మరొక పూట ముద్ద, చపాతి,పరోటా లాంటివి తినడం మంచిది.

Exit mobile version