RGV: 5 లక్షల శునకాల మధ్యలో మేయర్‌ను ఉంచండంటూ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్!

ఆదివారం అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అటు ప్రభుత్వంపై, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
2302rgv001

2302rgv001

RGV: ఆదివారం అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అటు ప్రభుత్వంపై, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబర్ పేట ఘటన జరిగిన వెంటనే మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో సమావేశం అయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవీ మేయర్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంబర్ పేట ఘటన జరిగిన వెంటనే మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో సమావేశం అయ్యారు. అంతేకాదు ఆకలితోనే కుక్కలు బాలుడిపై దాడి చేశాయని మేయర్ అన్నారు. 4 లక్షలకు పైగా వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేశామని ఆమె తెలిపారు. తాను డాగ్ లవర్‌ను అని కానీ కుక్కలకు ఆహారం పెట్టొద్దని అననని అన్నారు. ఓ మహిళా రోజూ కుక్కలకు మాంసం పెట్టేదని కానీ 2 రోజులుగా కుక్కలకు ఆహారం పెట్టకపోవడంతో బాలుడిపై దాడి చేసి చంపేశాయని మేయర్ అన్నారు. ఒక్కొక్కరు 20 కుక్కలను తీసుకొని స్టెరిలైజ్ చేస్తే నెలకు 600 కుక్కల చొప్పున ఎవరైనా పెంచుకుంటే బాగుంటుందని అన్నారు.

మేయర్ వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. కేటీఆర్ సార్ 5 లక్షల శునకాలను తెచ్చి డాగ్ హోంలో వేయండి. ఆ మధ్యలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉండేలా చూడండని వర్మ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఈ విషయంలో వర్మకే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. బాధ్యయుతమైన పదవిలో ఉన్న మేయర్‌ అలా మాట్లాడకూడదన్నారు.

  Last Updated: 23 Feb 2023, 10:26 PM IST