Site icon HashtagU Telugu

RGV on PK: ‘పవన్ కళ్యాణ్’ టార్గెట్ గా ‘ఆర్జీవీ’ వరుస ట్వీట్స్…!!!

pawan kalyan and RGV

pawan kalyan and RGV

ఎప్పుడూ కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ… వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్ర ‘భీమ్లా నాయక్’ ను ఉద్దేశించి వర్మ సెటైరికల్ గా ట్వీట్స్ చేశారు.

వర్మ ఏమని ట్వీట్స్ చేశారంటే…!

పవన్ కళ్యాణ్ గారూ… ఆరోజు సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలో రిలీజ్ చేయొద్దు, వర్కౌట్ అవ్వదు, అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా…. మీరు వినలేదు. ఫలితం చూశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా…. ‘భీమ్లా నాయక్’ ని ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయండి… పవర్ ప్రూవ్ చేయండి. ‘పుష్ప’ యే అంత చేస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిన మీరు నటించిన ‘భీమ్లా నాయక్’ ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి? పాన్ ఇండియా సినిమాలాగ రిలీజ్ చేయకపోతే… మీ ఫ్యాన్స్ అయిన మేమంతా… బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చేయలేం.

అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైమ్ లో పెట్టాను, కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైమ్ లో పెడుతున్నా… దీన్ని బట్టి నా సీరియస్ నెస్ అర్థం చేసుకోండి.

పవన్ కళ్యాణ్ గారు… ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రాంచరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే… మీరింకా ఒట్టి తెలుగును పట్టుకుని వేలాడడం… మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి ‘భీమ్లా నాయక్’ ని పాన్ ఇండియా కు తీసుకెళ్ళి మీరే ‘సబ్ కా బాప్’ అని ప్రూవ్ చేయండి.

ఇంటీరియర్ ఆంధ్రాలో జరిగిన ‘పుష్ఫ’ సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు కొమరం భీం, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు ‘భీమ్లా నాయక్’ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారూ… అంటూ వరుస ట్వీట్లు సంధించారు వర్మ. చివరగా ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే…

‘Fear of failure ensures failure’

వైఫల్య భయం వైఫల్యాన్ని నిర్ధారిస్తుందని తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ ను విమర్శించారు ఆర్జీవి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

Exit mobile version