RGV:ఏపీ ప్ర‌భుత్వంపై ఆర్జీవీ ఫైర్‌… స‌మాధానం కావాల్సిందేనంటున్న వ‌ర్మ‌

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై చిత్ర ప‌రిశ్ర‌మ‌, ప్ర‌భుత్వం మ‌ధ్య యుద్దం న‌డుస్తుంది. సంక్రాంతి సీజ‌న్ ప్రారంభంకావ‌డంతో చాలా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 4, 2022 / 11:12 PM IST

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై చిత్ర ప‌రిశ్ర‌మ‌, ప్ర‌భుత్వం మ‌ధ్య యుద్దం న‌డుస్తుంది. సంక్రాంతి సీజ‌న్ ప్రారంభంకావ‌డంతో చాలా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.అయితే టికెట్ల వ్య‌వ‌హారంతో ఆ సినిమాల‌న్నీ వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు అంటున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాని చిత్ర బృందం వాయిదా వేయ‌గా..రాధేశ్యామ్ కూడా వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. భీమ్లా నాయక్, బంగార్రాజుతో సహా చిన్న సినిమాలు సూపర్ మచ్చి, డీజే టిల్లు విడుదల కాబోతోన్నాయి. అయితే డీజే టిల్లు మినహాయిస్తే.. మిగిలిన వన్నీ భారీ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. ప్రత్యేకించి- రాధేశ్యామ్. పాన్ ఇండియా సూపర్ స్టార్ గుర్తింపును పొందిన ప్రభాస్-పూజా హెగ్డే నటించిన ఈ మూవీ బడ్జెట్ రై.350 కోట్లపైగానే ఉంది.

ఓవైపు క‌రోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఆంక్ష‌లు విధిస్తున్నారు. అయితే అర‌కొర‌గా న‌డుస్తున్న సినిమాథియేట‌ర్ల‌లో ఈ సినిమాలు ఆడాల్సి ఉంది. కానీ ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. క‌రోనా, ఓమిక్రాన్ టెన్ష‌న్ తో పాటు ఇప్పుడు ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు సినిమా టికెట్ల రేట్లు త‌ల‌నొప్పిగా మ‌రింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను ప్ర‌భుత్వంతగ్గించడం.. కలెక్షన్లపై ప్రభావం చూపుతుందనే ఆందోళన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొని ఉంది.

ఈ వివాదం చాలా మంది పెద్ద న‌టులు నోరు మొద‌ప‌డం లేదు. అయితే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఏపీ ప్ర‌భుత్వంపై ప్రశ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లను సంధిస్తున్నారు. పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ ఏకంగా డజను ట్వీట్లు సంధించారాయన. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, పప్పు, నూనె.. వంటి నిత్యావసర సరుకులను పేదల ప్రజలకు తక్కువ రేటుకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టే.. సినిమా టికెట్ల రేట్లను కూడా విక్రయించుకోవాలని రామ్‌గోపాల్ వర్మ సూచించారు. దీనికోసం రేషన్ షాపుల తరహాలో.. రేషన్ థియేటర్లు పెట్టాలని సూచించారు. పేదలకు సినిమా అనేది అత్యవసరంగా ప్రభుత్వం భావించినప్పుడు- విద్య, వైద్యం తరహాలోనే వాటి టికెట్ల రేట్లపై సబ్సిడీ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.