AP : స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫై వర్మ 12 ప్రశ్నలు..సమాదానాలు ఎవరైనా చెప్పుకోవచ్చు

ఈ 12 ప్రశ్నలకు ఎవరూ స్పందించకపోతే అన్ని ప్రశ్నలకూ అవునని సమాధానం ఇచ్చినట్టేనని ట్విస్ట్ ఇచ్చారు

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 03:10 PM IST

స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill scam case)కు సంబదించి CID అధికారులు మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చంద్రబాబు బెయిల్ ఫై బయటకు తీసుకొచ్చేందుకు ఆరు రోజులుగా లాయర్లు ట్రై చేస్తున్న బెయిల్ లభించడం లేదు. ప్రాణ హాని కనీసం హౌస్ రిమాండ్ కైనా తరలించడాన్ని అన్నకానీ ఏసీబీ కోర్ట్ అనుమతి ఇవ్వడం లేదు. మరోపక్క చంద్రబాబు అరెస్ట్ ఫై రోజు రోజుకు నిరసనలు , ఆందోలనలు ఎక్కువైపోతున్నాయి. మొదట ఏపీకే పరిమితమైన నిరసన జ్వాల..ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువవుతుంది.

ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) తన ట్విట్టర్ వేదికగా ఈ కేసుకు సంబంధించి 12 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాదానాలు చెప్పొచ్చన్నారు. ఈ 12 ప్రశ్నలకు ఎవరూ స్పందించకపోతే అన్ని ప్రశ్నలకూ అవునని సమాధానం ఇచ్చినట్టేనని ట్విస్ట్ ఇచ్చారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ పేరునూ ఇందులో పొందుపరిచారు.

మరి ఆ 12 ప్రశ్నలు ఏంటి అనేది చూద్దాం.

1. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్. ‌అవునా?

2. ఈ ఫేక్‌ ఒప్పందంతోనే 300 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇచ్చారు. అవునా ?

3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారు. డబ్బు విడుదల కోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు. అవునా? అని ప్రశ్నించారు.

4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, సీమెన్స్‌ కంపెనీ లిఖిత పూరకంగా చెప్పింది. అవునా?

5. 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్ద లేదని సీమెన్స్‌ చెప్పింది. అవునా?

6. ఈ మేరకు సెక్షన్‌ 164 సీఆర్పీసీ కింద జడ్జి ఎదుట ఏపీ అధికారులు, సీమెన్స్‌ ప్రతినిధులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అవునా?

7. విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది. అవునా?

8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది. అవునా?

9. 300 కోట్ల రూపాయలకు పైగా డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు. అవునా?

10. స్కిల్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసింది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ ఈడీ ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు. అవునా ?

11. విజయవాడలోని ఏసీబీ కోర్టు దాదాపు 10 గంటల సేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. అవునా ?

12. ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబు చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో, అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ఈడీ చెబుతోంది. అవునా ? ఒకవేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

మరి వీటికి టీడీపీ సమాధానం చెపుతుందా..? లేక చంద్రబాబు తరుపు లాయర్లు చెపుతారా..? లేదంటే టీడీపీ శ్రేణులు చెపుతారా అనేది చూడాలి.

 

Follow us