Site icon HashtagU Telugu

Hyderabad Airport: అది రాజీవ్ గాంధీ విమానాశ్రయమా ? జీఎంఆర్ విమానాశ్రయమా ? సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ లేఖ!!

Hyderabad Airport Rgia

Hyderabad Airport Rgia

హైదరాబాద్ ఎయిర్ పోర్టు పేరేమిటి ? అది జీఎంఆర్ విమానాశ్రయమా ? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమా? ఈ ప్రశ్నలు వేస్తున్నది సామాన్యులు కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

విమానాశ్రయం పేరేంటో తేల్చి చెప్పాలంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వెబ్ సైట్ లో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు మిస్సయిందో చెప్పాలి ? అని ఆయన నిలదీశారు.

వెంటనే వెబ్ సైట్ లో రాజీవ్ పేరును చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు లో రాజీవ్ గాంధీకి చెందిన హాల్ ఆఫ్ ఫేమ్ ఫోటోతో పాటు ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జీఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. మనదేశంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగో అతిపెద్ద ఎయిర్ పోర్టు ఇదే. ఈ విమానాశ్రయం 2008 మార్చి 23న ప్రారంభమైంది.