Komatireddy: రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు: కోమటిరెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి చేరికలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు. పొంగులేటితో భేటీకి ముందే కోమటిరెడ్డితో రేవంత్ భేటీ కావడం ఆసక్తిని రేపింది. రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ […]

Published By: HashtagU Telugu Desk
Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి చేరికలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు.

పొంగులేటితో భేటీకి ముందే కోమటిరెడ్డితో రేవంత్ భేటీ కావడం ఆసక్తిని రేపింది. రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ స్థానాల్లోనైనా గెలిచి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారం దక్కించుకుంటుందని కోమటిరెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.

  Last Updated: 21 Jun 2023, 05:00 PM IST