Site icon HashtagU Telugu

Hyderabad: చెరువులు కబ్జా చేయడంతోనే నగర పరిస్థితి ఇలా తయారైంది: రేవంత్

Hyderabad

New Web Story Copy (74)

Hyderabad: తెలంగాణాలో పది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. ఇక భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో నగర ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా నగర పరిస్థితిపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ స్పందించారు.

తేలికపాటి వర్షాలకే హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు పారుతుండటంతో నగర ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. హైదరాబాద్ లో చెరువులను కబ్జా చేయడం ద్వారా వర్షాకాలంలో ఆ ప్రభావం కనిపిస్తుందని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. చెరువులు కబ్జాలు, అక్రమ నిర్మాణాల ద్వారా రోడ్లను అడ్డగోలుగా విస్తరిస్తున్నారని ఆరోపించారు రేవంత్. అడ్డంగా విస్తరించాల్సిన రోడ్లను, నిలువుగా విస్తరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణంగానే వర్షపు నీరు రోడ్లపైకి వస్తుందని చెప్పారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని రేవంత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు గతంలో చేసినవే అయినా అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయని రేవంత్ తాజాగా తెలిపారు.

Also Read: WI vs IND: కరేబియన్ గడ్డపై సత్తా చాటిన బౌలర్లు

Exit mobile version