Site icon HashtagU Telugu

Revanth Reddy Praises : దావోస్ వేదికగా చంద్రబాబు పై సీఎం రేవంత్ ప్రశంసలు

Revanth Reddy Praises

Revanth Reddy Praises

మరోసారి సీఎం రేవంత్(CM Revanth )..తన గురు భక్తిని చాటుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి(Development of Hyderabad)పై చర్చ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) పాత్రను ప్రశంసించారు. 1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మరియు సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి హైదరాబాద్‌ను గ్లోబల్ సిటిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందని రేవంత్ పేర్కొన్నారు.

TGSRTC: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: టీజీఎస్‌ఆర్టీసీ

“90లలో చంద్రబాబు గారు సృష్టించిన ఐటీ బూమ్ హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో సామాజిక మౌలిక వనరులు అభివృద్ధి చెందాయి. ఈ ఇద్దరు నాయకుల కృషి ఫలితంగా నేడు నగరం ఎంతో ప్రోత్సాహాన్ని అందుకుంటోంది” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిగిన సమావేశంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.