Site icon HashtagU Telugu

Congress: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తెలంగాణ‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

Revanth Reddy

Revanth Reddy

కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం ముఖ్య‌మంత్రి పై కేసు నమోదు చేయాలని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కార్యాలయాలను ముట్టడి చేయాల‌ని కాంగ్రెస్ పిలుపు నిచ్చిన నేప‌ధ్యంలో, కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు పోలీసు కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన క్ర‌మంలో, రేవంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ నేప‌ధ్యంలో రేవంత్ రెడ్డి ఇంటిచుట్టూ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అటువైపు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈరోజు పోలీసు కమిషనరేట్ల ముట్టడికి పిలుపు నివ్వడంతో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ ఆలీలను కూడా రాష్ట్ర‌ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక జ‌గిత్యాల‌లో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ్ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినా, కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మాత్రం ప‌ట్టు విడ‌వ‌లేదు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీసు కార్యాల‌యాల వ‌ద్ద ధ‌ర్నాల‌కు దిగేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్ర‌య‌త్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సహా పలువురు కాంగ్రెస్ నేత‌ల్ని నిర‌స‌న చేయ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, కాంగ్రెస్ నాయ‌కుల‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రజాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.