Site icon HashtagU Telugu

Revanth Reddy Contesting From Kodangal : కొండగల్ నుండి రేవంత్ పోటీ..

Revanth Reddy Gives Clarity About Contesting From Kodangal

Revanth Reddy Gives Clarity About Contesting From Kodangal

తెలంగాణ లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే ఎన్నికల హోరు మొదలైంది. రీసెంట్ గా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించడం తో..మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ ఎలాగైతే 119 స్థానాలకు 115 స్థానాల అభ్యర్థులను ప్రకటించిందో..కాంగ్రెస్ పార్టీ సైతం మొత్తం స్థానాల అభ్యర్థులను ప్రకటించే ఆలోచన చేస్తుంది.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy )..తాను కొండగల్ (Kondangal) నుండి బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టం చేసారు. గురువారం కొండగల్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్..కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. గత ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి మంత్రి కేటీఆర్ కొడంగల్ ప్రజలను మోసం చేశారని , కొడంగల్ నియోజకవర్గానికి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో కట్టిన గుడి, బడి తప్ప.. మండల కేంద్రంలో కనీసం జూనియర్ కళాశాలను కూడా నిర్మించలేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే కేసీఆర్​ ఆపద మెక్కులు మొక్కుతున్నాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Read Also : Congress List : కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తు! నెలాఖ‌రులోగా 119 అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?

నాలుగేళ్లుగా పట్నం మహేందర్‌ రెడ్డి (Patnam Mahender Reddy)కి అపాయిట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌…. ఓట్ల కోసం మంత్రిని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్‌.. డబ్బు, మద్యం, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్​ (CM KCR)ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానికంగా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డిని కలిసిన రేవంత్.. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పోటీ అంశంపై చర్చించారు. టికెట్‌ కోసం తన తరఫున కొడంగల్‌ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేస్తారని వెల్లడించారు.