BRS Leader: కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు: దాసోజు

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 11:13 AM IST

BRS Leader: కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు అని బిఆర్ఎస్ సినీయర్ నాయకుడు డా దాసోజు శ్రవణ్ అన్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై నాలుగు గంటకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఇందిరా పార్క్ సాక్షిగా పవర్ హాలిడేలను తట్టుకోలేమని అనేక పరిశ్రమలు దీక్షలు చేస్తుండేవారు. కరెంట్ లేక చీకట్లో బ్రతికిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఏ రైతైనా రాత్రి పూట మోటార్ వేయడానికి వెళ్తున్నారా ? ఎందుకు రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతుండు ? అని ప్రశ్నించారు.

‘‘తెలంగాణ స్వ రాష్ట్రం గా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 18,453 మెగావాట్లకు పెరిగింది. నాడు సోలార్ పవర్ ఉత్ప త్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరచి ఈగణాంకాలని చూడాలి. కర్నాటక, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ లో ఇంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారా ? రేవంత్ ఎందుకు ప్రజల చెవిలో పువ్వులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. *సోనియా గాంధీని బలి దేవత అన్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల పై దాడి చేసి రైపుల్ రెడ్డిగా మారిన చరిత్ర రేవంత్ రెడ్డిది. చంద్రబాబు చెంచా గా, తెలంగాణ విద్రోహిగా పని చేసిన రేవంత్ రెడ్డికి అసలు అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఉందా ? అంటూ దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అమరావతిలా ఇక్కడ 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ మాటలోనే రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటికి వచ్చింది. రియలెస్టేట్ దందా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. *యువకుల చేత కూరగాయలు అమ్మిస్తానని చెబుతున్నాడు రేవంత్ రెడ్డి. కెటీఆర్ లాంటి నాయకుడు దూరద్రుష్టితో టెక్నాలజీ , టెక్నాలజీ కాంపిటెన్సీ పెరగాలని పని చేస్తుంటే.. మోడి పకోడీలు అమ్మోకోవాలని చెబుతున్నారు, సన్నాసి రేవంత్ రెడ్డి కూరగాయలు అమ్ముకోవాలని అంటున్నాడు. ఇలాంటి అసమర్ధులు మన తెలంగాణకి కావాలా ? దయచేసి ప్రజలు అర్ధం చేసుకోవాలి’’ అని అన్నారు.