Site icon HashtagU Telugu

Revanth Reddy:పైసలే ముఖ్యం ప్రాణాలు కాదు

Congress list

తెలంగాణ ప్రభుత్వం న్యూ ఈయర్ వేడుకలకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఆరోజు రాత్రి 12 గంటలవరకు వైన్స్ ఓపెన్ ఉంటాయని, బార్లు ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓమిక్రాన్ నేపథ్యంలో కరోనా కట్టడికోసం పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రాత్రి పూట వైన్స్ తెరుస్తోందని రేవంత్ విమర్శించారు.

12 గంటల వరకు వైన్స్, ఒంటిగంట వరకు బార్స్ ఓపెన్ ఉంచుతామని ప్రభుత్వం చెబుతోందని, దీనిద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కానీ ప్రజల జీవితాలు ఏమవ్వాలని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి రెవెన్యూ మాత్రమే ముఖ్యమని, ప్రజల జీవితాలు ఏమైనా అవసరం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు.